టెక్నికల్ ఇబ్బందులు వాస్తవమే: గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు

రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్, పలు పోస్టుల ఖాళీల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది..

Update: 2023-04-17 17:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్, పలు పోస్టుల ఖాళీల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా దరఖాస్తు చేసుకునేందుకు వన్ టైం రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి అని గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు సూచించింది. దీంతో అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను తొలుత టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని బోర్డు కూడా స్పష్టంచేసింది.

అయితే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను పరిష్కరించినట్లు గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. అలాగే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టంచేసింది. 2018 నుంచి ఒకే రకమైన దరఖాస్తు రుసుమును వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి helpdesktreib@telangana.gov.in లేదా treirbhelpline@gmail.com కు మెయిల్ ను సంప్రదించాలని సూచించారు.

అర్హత కలిగిన అభ్యర్థికి విద్యార్హతల వివరాల నమోదు సమయంలో సరైన విద్యార్హత చూపించకుంటే ఇతర అర్హతలు అనే ఆప్షన్ ని నొక్కి దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లనే పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో సర్వర్ లోడింగ్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే నాన్ పీక్ హవర్స్ లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు

Tags:    

Similar News