ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా యువ ఓటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ లో పాల్గొనాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

Update: 2024-05-12 12:02 GMT

దిశ , హైదరాబాద్ బ్యూరో : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా యువ ఓటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ లో పాల్గొనాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని చార్మినార్, యాకుత్ పుర, గోషామహల్, మలక్ పేట్, కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్లలోని డీఆర్సీ కేంద్రాలను సందర్శించి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్సీ కేంద్రాలలో చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సోమవారం జరిగే పోలింగ్ పగడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు.

పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పని చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఏలాంటి తప్పిదాలకు నమస్కారం ఇవ్వవద్దని, ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నామని, పోలింగ్ పూర్తయిన తర్వాత అదేవిధంగా జాగ్రత్తగా స్ట్రాంగ్ రూములకు తరలించడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి యువ ఓటర్లు తమ కుటుంబ సభ్యులతో సహా పోలింగ్ లో పాల్గొనాలని కోరారు.

హైదరాబాద్ నియోజకవర్గంలోని 1944 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ , టాయిలెట్, షామియాన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నందున ఒక పోలింగ్ కేంద్రానికి రెండు బియు ల చొప్పున 4862 బ్యాలెట్ యూనిట్లు,2427 కంట్రోల్ యూనిట్,2720 వివి ప్యాట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. ఓటర్ ఇన్ఫెక్షన్ స్లీప్ లు ఓటర్లకు అందజేయడం జరిగింది , ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కోసం 203 సెక్టోరల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. ఎక్కడైనా ఈవీఎంలు మోరాయిస్తే వెంటనే రిప్లేస్ చేయడం జరుగుతుందన్నారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని , సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను నియమించామన్నారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ పి ఐ శ్రీవిద్య, ఏఆర్వోలు, పి ఓ లు,ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News