వివాదాస్పదంగా పట్టాలిచ్చిన భూమిలో పంచాయతీ భవన నిర్మాణం..

పేదలకు పట్టాలిచ్చిన భూమిలో పంచాయతీ భవన నిర్మాణం చేపట్టడం వివాదాస్పదంగా మారింది.

Update: 2023-02-07 05:09 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: పేదలకు పట్టాలిచ్చిన భూమిలో పంచాయతీ భవన నిర్మాణం చేపట్టడం వివాదాస్పదంగా మారింది. నారాయణపేట నియోజకవర్గం‌లోని పలు గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలకు ఇటీవలనే నిధులు మంజూరు కాగా జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ చేతుల మీదుగా సింగారం చౌరస్తాలో నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయించారు. మంగళవారం నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి పలు గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధం కాగ పెరపళ్ళ గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం వివాదాస్పదంగా మారింది.

పేరపల్ల గ్రామంలో సర్వేనెంబర్ 645/2 లో 1998 సంవత్సరంలో గ్రామంలోని 21 మంది పేదలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు ప్లాట్లను కేటాయిస్తూ ప్రభుత్వం లబ్ధిదారులకు పట్టాలను అందజేసింది. గ్రామపంచాయతీ సభ్యులకు కూడా ఈ విషయం చెప్పకుండా ఆగమేఘాల మీద మంగళవారం ఉదయం గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి పంచాయతీ తీర్మానం లేకుండానే ఏర్పాట్లు చేయడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేను సైతం తప్పుదోవ పట్టించే విధంగా నిర్ణయం తీసుకోవడం సరికాదనీ గ్రామస్తులు, లబ్ధిదారులు వాపోతున్నారు.

Also Read..

'జీ స్కేయర్‌'పై RERA యాక్షన్.. భారీ జరిమానాలకు రంగం సిద్ధం! 

Tags:    

Similar News