‘కాంగ్రెస్ అంపైరింగ్.. బీఆర్ఎస్ ఎంఐఎం షాడో బాక్సింగ్’

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు.

Update: 2023-06-01 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అసరంలేదని అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మా చేతిలో ఉందని ఇన్నాళ్లు ఎంఐఎం చెప్పిందని తీరా ఎన్నికల సంవత్సరంలో బీఆర్ఎస్ స్టీరింగ్ మా చేతుల్లో లేదని ఒవైసీ చెబుతున్నాడని విమర్శించారు. అది బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల ఇంటర్నల్ వ్యవహారం అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం..ఈ మూడు పార్టీలు అవిభక్త కవలలు అన్నారు.

ఎన్నికలకు ముందో ఆ తర్వాతో పొత్తుకు వెళ్తారా, కూటమి కడతారా లేక సర్దుబాటు చేసుకుంటారా అనేది ఈ మూడు పార్టీలకే తెలుస్తుంది కానీ ప్రజలకు కాదన్నారు. స్టీరింగ్ మా చేతిలో ఉంటే దేవాలయాలకు కోట్ల రూపాయల కేటాయింపు ఎలా జరుగుతుందని అన్న ఒవైసీ మాటలను మాత్రం పరిశీలించవలసి ఉందన్నారు. ఈటల మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతి భవన్ గేటు దాటలేరు కానీ అసద్ మాత్రం బైక్‌పై నేరుగా ప్రగతి భవన్ లోపలికి వెళ్తారని బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఏ విధమైన అవగాహన ఉంది అనేది తెలంగాణ ప్రజలకు తెలియనిదా అని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అంపైర్ చేస్తుంటే ఎంఐఎం, బీఆర్ఎస్ షాడో బాక్సింగ్ చేస్తోందని ధ్వజమెత్తారు.

Read More:   లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి

Tags:    

Similar News