శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో ఉద్రిక్త వాతావరణం.. ఆందోళనకు దిగిన ప్రయాణికులు!

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Update: 2023-02-24 09:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం విమాన ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 7 గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదని వారితో వాగ్వాదానికి దిగారు.

ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం తొలుత 11.45 వెళ్తుందని అధికారులు ప్రకటన చేశారని.. ఇప్పటివరకు ఎప్పుడు బయలుదేరుతుందో ఎయిర్ ఇండియా సిబ్బంది క్లారిటీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. 8 గంటల నుంచి ఎదురుచూస్తున్నామని, ఇంకెంత సేపు ఇలా వెయిట్ చేయిస్తారంటూ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. విమానం ఎప్పుడు బయలు దేరుతుందో చెప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా, ఫ్లైట్ టైమింగ్స్‌లో నిర్లక్ష్యం వహించడంపై ప్రయాణికులు, సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది.

Tags:    

Similar News