MP అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

లోక్‌సభ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం అయింది.

Update: 2024-01-30 13:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్యచరణపై సుధీర్ఘంగా చర్చించారు. అంతేకాదు.. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 60 రోజుల్లో లోక్‌సభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని.. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని సూచించారు.

ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందని తెలిపారు. ఎన్నికల వేళ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. మొదటగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికకు పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే అధిష్టానం తెలంగాణకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని అన్నారు.

Read More..

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అప్పుడే.. వారికే ప్రాధాన్యత..

Tags:    

Similar News