అవి వద్దనుకుంటే బీజేపీకే ఓటు వేయండి.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి ఒటేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-04 09:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీకి ఒటేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేస్తే రిజర్వేషన్లు కొనసాగుతాయని అన్నారు. బీజేపీకి ఓటేస్తే మాత్రం రిజర్వేషన్లు రద్దవుతాయని తేల్చి చెప్పారు. బీజీపీకి వేసే ప్రతి ఓటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై వేటు లాంటిది అని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కావాలంటే కచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ కు ఓటేయ్యాలని, వద్దనుకుంటే బీజేపీకేయండని రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. అలాగే బీజేపీ అబద్ధాల యూనివర్సిటీ అని అన్నారు. పదేళ్లుగా పీఎంగా ఉన్న నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులుగా ఉన్న అమిత్ షా, కిషన్ రెడ్డిలు తెలంగాణకు ఏం తెచ్చారో జనాలకు చెప్పాలని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు సోనియా గాంధీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోడీ ప్రభుత్వం కాలగర్భంలో కలిపిందని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డిలో ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందని బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News