Delhi Liquor Case :కేబినెట్ మీటింగ్‌ ఈడీపైనే! యాక్షన్ ప్లాన్‌పై చర్చించే ఛాన్స్

రాష్ట్ర కేబినేట్ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది.

Update: 2023-03-09 03:53 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కేబినేట్ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. ఇందులో పాలన అంశాల కంటే రాజకీయ అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కవితను విచారణకు పిలిచినది తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కేబినెట్ తీర్మానం చేయొచ్చుననే సమాచారం. ఇంతటి కీలక టైమ్‌లో కేంద్రం తీరుపై కేబినెట్‌లో ప్రస్తావనకు తెవొచ్చునని సీనియర్ మంత్రులు అభిప్రాయపడ్డారు.

ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఏ విధంగా నిరసనలు తెలపాలి? అనే దానిపై చర్చించవచ్చని పార్టీ వర్గాల టాక్. ప్రభుత్వ స్థలాల్లో ఉండే నిరుపేదల ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు జీవో 58 కింద మరోసారి దరఖాస్తులను స్వీకరించే వెసులుబాటును కేబినెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోనుంది. 2018 ఎన్నికల హామీల్లో సొంతంటికి ఆర్థికసాయంపై గైడ్ లైన్స్‌కు మంత్రివర్గం ఆమోదించవచ్చని, నిధుల కొరతను అధిగమించేందుకు మరికొన్ని ప్రభుత్వ స్థలాలను అమ్మేందుకు.. యాసంగి వడ్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం.

Read more:

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎల్లుండి ఈడీ విచారణకు కవిత

Tags:    

Similar News