దళితబంధు ఇచ్చేదాక పోరాటం ఆపేదే‌లే: BJP State Chief Kishan Reddy

రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఎస్సీలకు దళితబంధు ఇచ్చే వరకు బీజేపీ పోరాటం ఆపేది లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Update: 2023-07-26 14:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఎస్సీలకు దళితబంధు ఇచ్చే వరకు బీజేపీ పోరాటం ఆపేది లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇన్ చార్జీలతో సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రధానంగా దళితులు అన్ని రంగాల్లో వంచనకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేసీఆర్ అత్యంత ఆడంబరంగా ప్రవేశపెట్టిన దళితబంధు విషయంలో ఆరంభ శూరత్వం చూపించారు తప్పితే అమలులో జాప్యం చేస్తున్నారన్నారు. 9 ఏండ్లుగా కొత్త రేషన్ కార్డ్ ఇవ్వని కారణంగా దళితులు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళితబంధు వరకు కేసీఆర్ దళితులకు చేసిన మోసలపై రాబోవు మూడు నెలలపాటు నిర్విరామ పోరాటాలు చేయాలని నాయకులకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

Tags:    

Similar News