Chicken prices :మాంసం ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ రేట్లు ఆల్ టైం రికార్డు

మాంసం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ, ఏపీలో బాయిలర్ చికెన్ రేట్లు కొండెక్కాయి.

Update: 2023-06-10 08:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాంసం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ, ఏపీలో బాయిలర్ చికెన్ రేట్లు కొండెక్కాయి. వేసవి కారణంగా చికెన్ కొరత ఇంకా కొనసాగుతోంది. నెల రోజుల క్రితం రూ.200 ఉన్న చికెన్ రేటు 20 రోజుల వ్యవధిలో రూ.300లకు చేరింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో చికెన్ ధర రూ.350కి చేరింది. విజయవాడలో కిలో చికెన్ ధర రూ.350 ఉండగా కిలో బోన్ లెస్ చికెన్ ధర రూ.700 లకు చేరింది.

ఇవే చికెన్ రేట్లు మరో నెల పాటు కొనసాగే చాన్స్ ఉందని కోళ్ల ఫామ్ నిర్వాహకులు ఉంటున్నారు. కోళ్ల ఫామ్ లలో లైవ్ బర్డ్ ధర రూ.166 పలుకుతోంది. ఎండల ఎఫెక్ట్, పెళ్ళిళ్ల సీజన్ కావడంతో చికెన్ ధర మరింత పెరిగే చాన్స్ ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. ఎండ వేడికి కోళ్లు చనిపోవడంతో మార్కెట్ లో తీవ్ర కొరత ఏర్పడింది.

బ్రెస్ట్‌ మసాజ్.. వేళ్లతో సున్నితంగా ప్రెస్ చేయడం ద్వారా.

Tags:    

Similar News