MP Elections 2024 : చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్

బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Update: 2024-05-13 06:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామమైన చింతమడకలో గులాబీ బాస్ ఓటు వేశారు. చేతి కర్ర సహాయంతో పోలింగ్ బూత్ కు వచ్చిన కేసీఆర్ వెంట హరీష్ రావు, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు పోలింగ్ బూత్ వద్ద ప్రజలు ఆసక్తి చూపారు. కొంత మంది సెల్ ఫోన్లతో కేసీఆర్‌ను ఫొటో తీసుకున్నారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నందినగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తెలంగాణలో తొలి రెండు గంటల్లో 9.48 శాతం పోలింగ్ నమోదైంది. 

Similar News