బట్టెబాజ్ సీఎం మనకే ఉన్నాడు: బక్క జడ్సన్ (వీడియో)

తెలంగాణలో బట్టెబాజ్ ముఖ్యమంత్రి మనకే ఉన్నాడని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఘాటు విమర్శలు చేశారు.

Update: 2023-02-03 09:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బట్టెబాజ్ ముఖ్యమంత్రి మనకే ఉన్నాడని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఘాటు విమర్శలు చేశారు. 2014 నుంచి 2020 వరకు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని సీఎం కేసీఅర్ చెప్పడంపై శుక్రవారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల ఫోటోలు, ఎఫ్ఐఆర్ కాపీలతో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడిన తమ కుటుంబ సభ్యుల ఫోటోలను పట్టుకుని గతంలో ధర్నాలు చేశారని ఇవన్ని ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి బయలుదేరిన బక్క జడ్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండి:   సీఎంతో పాటు MLC కవితపైనా చర్యలు తీసుకోవాలి: భట్టి

Tags:    

Similar News