Telangana budget 2023 : బడ్జెట్‌పై కేసీఆర్‌ స్టైళ్లో స్పందించిన బండి సంజయ్

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సెటైర్లు వేశారు.

Update: 2023-02-06 10:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సెటైర్లు వేశారు. బడ్జెట్‌లో 'సరుకు లేదు సంగతి లేదు' అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం అంకెల గారడీ బడ్జెట్‌లానే ఉందన్న ఆయన.. మొత్తానికి బడ్జెట్ గందరగోళంగా ఉందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌పై ప్రజల స్పందనే కరువైందని ఎద్దేవా చేశారు. ఇక, సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే సరుకు లేదు, సంగతి లేదు! అంటూ సెటైర్లు వేశారు. అందులో సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు! అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 'అంకెల గారడీ బడ్జెట్.. గందరగోళమైన బడ్జెట్.. ప్రజల స్పందన కరువైన బడ్జెట్.. ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే.. సరుకు లేదు, సంగతి లేదు!, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు!, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు!, అంతా వట్టిదే డబ్బ!, బభ్రాజమానం భజగోవిందం!!' అంటూ బడ్జెట్‌పై బండి కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News