రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీ నియామకం

తెలంగాణ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కమిటీని ప్రభుత్వం నియమించింది.

Update: 2023-02-06 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి చైర్మన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నియమిస్తూ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ తో పాటు సభ్యులుగా ప్రొఫెసర్‌ మంజూరు హుస్సేన్‌ (జేఎన్‌టీయూకు మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమిక్‌ ఎక్స్‌పర్ట్‌), డాక్టర్‌ విమలా థామస్‌ (సిద్ధిపేట మెడికల్‌ కాలేజీ అకాడమిక్‌ ఎక్స్‌పర్ట్‌), జీవీ లక్ష్మణ్‌రావు (చార్టర్డ్‌ అకౌంటెంట్‌-ఫైనాన్స్‌ ఎక్స్‌పర్ట్‌), పి.సుధీర్‌రెడ్డి (న్యాయవాది-లీగల్‌ ఎక్స్‌పర్ట్‌), ఓయూ వీసీ (ఇంజినీరింగ్‌ కోర్స్‌), కాలేజీ నారాయణ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ (మెడికల్‌ కోర్స్‌), ఎంజీ యూనివర్సిటీ వీసీ (బీఈడీ-ఇతర కోర్సులు), ప్రభుత్వం తరఫున ఆర్థికశాఖ నుంచి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ఆల్‌ ఇండియా కౌన్సెల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ నుంచి ఒకరు, ఎడ్యుకేషన్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీని సభ్యుడిగా నియమిచింది.

Similar News