వరంగల్ పార్లమెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా బీఆర్ఎస్ సమన్వయకర్తల నియామకం
2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది.
దిశ, తెలంగాణ బ్యూరో : 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చేసుకున్న ఆ పార్టీ.. వరంగల్ పార్లమెంటుకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.
1. పరకాల: బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీ
2. పాలకుర్తి: సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ, మెట్టు శ్రీనివాస్, మాజీ చైర్మన్
3. స్టేషన్ ఘనపూర్: పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే
4. వరంగల్ వెస్ట్: మర్రి యాదవ రెడ్డి, మాజీ కుడా చైర్మన్, నాగుర్ల వెంకన్న, మాజీ చైర్మన్, ఎస్. సుందర్ రాజ్, కుడా చైర్మన్
5. వరంగల్ ఈస్ట్: పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ
6. వర్ధన్నపేట: కే. వాసుదేవారెడ్డి, మాజీ చైర్మన్, సమ్మారావు, జడ్పీ మాజీ చైర్మన్
7. భూపాలపల్లి: బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ