వ్యక్తిగత డేటా చోరీ కేసులో కీలక పరిణామం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతవారం వెలుగు చూసిన ఈ వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయింది.

Update: 2023-03-30 10:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతవారం వెలుగు చూసిన ఈ వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయింది. 16.8 కోట్ల మంది పర్సనల్ డేటా లీక్ అయినట్లు ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

ఈ మేరకు తాజాగా డేటా లీక్‌పై సైబరాబాద్ పోలీసుల నుంచి ఈడీ సమాచారం కోరింది, ఇందులో రక్షణ విభాగంలో పని చేసే ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలకు చెందిన రహస్య సమాచారమంతా చోటీకి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మనీలాండరింగ్ ఏదైనా జరిగిందా అనేకోణంలో ఈడీ దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక సంచలనాలు వెగులు చూస్తుండగా దర్యాప్తు ముందుకు సాగుతున్న క్రమంలో ఎలాంటి సెన్సేషన్స్ బయటపడతాయనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News