'అలీ నవాజ్ జంగ్ గృహాన్ని ఇంజనీర్ల స్మారక స్థలంగా మార్చాలి'

అలీ నవాజ్ జంగ్ నివసించిన గృహాని ఇంజినీర్ల స్మారక ప్రదేశంగా అభివృద్ధి పరచాలని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Update: 2022-12-06 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అలీ నవాజ్ జంగ్ నివసించిన గృహాని ఇంజినీర్ల స్మారక ప్రదేశంగా అభివృద్ధి పరచాలని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాగునీటి రంగ అభివృద్ధికి సంబంధించిన అంబేద్కర్ వ్యాసాలను తెలుగులో అనువదించి ప్రచురించాలని ఆయన కోరారు. మంగళవారం ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ బహదూర్ గారి 73వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 6వ తేదీన తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినోత్సవం గా జలసౌధలో జరుపుకున్నారు. ఈ సంవత్సరం 2021 డిసెంబర్ 7 నుంచి దివంగతులైన 71 మంది ఇంజినీర్ల చిత్రపటాలకు దీపాలను వెలిగించి పుష్పాలతో తెలంగాణ ఇంజినీర్లు నివాళులు అర్పించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కావడంతో వారిని కూడా ఇదే కార్యక్రమంలో స్మరించుకున్నారు.

ఈ సదర్భంగా ఈఎన్‌సీ అడ్మిన్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంజినీర్లకు రావాల్సిన అన్ని అలవెన్సులను సకాలంలో అందించడమే వారికి అందించే నివాళి అనే లక్ష్యంతో ఒక సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి పరిచామన్నారు. విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం 161 మంది చనిపోగా కోవిడ్ వృద్ధి తగ్గిన కారణంగా ఇది 71 కి తగ్గిందని, ఈ సంఖ్య ఇంకా తగ్గాలని కోరుకున్నారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే మాట్లాడుతూ.. ఈ ఏడు చనిపోయిన వారిలో తనకు 25 ఎండ్లుగ సన్నిహితులైన నిజాం వెంకటేశం ఉన్నారని, చాలా మంది మిత్రులు కూడా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం గౌరవాధ్యక్షుడు చంద్రమౌళి, ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ వెంకటేశం, రమణా నాయక్, రమాదేవి, అనేక మంది రిటైర్డ్ ఇంజినీర్లు, సర్వీస్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Similar News