ఘనంగా మహాత్మాగాంధీ 153వ జయంతి వేడుకలు

నిర్మల్ జిల్లాకేంద్రంతోపాటు సోన్, దిలావర్ పూర్, లక్ష్మణచాంద మండలాల్లోని గ్రామాల్లో జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి వేడుకల్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

Update: 2022-10-02 08:45 GMT

దిశ, నిర్మల్ కల్చరల్ : నిర్మల్ జిల్లాకేంద్రంతోపాటు సోన్, దిలావర్ పూర్, లక్ష్మణచాంద మండలాల్లోని గ్రామాల్లో జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి వేడుకల్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. గాంధీజీ విగ్రహాలను శుద్దిచేసి పూలమాలలతో అలంకరించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుని నివాళులర్పించారు.

మాజీఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో..

నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో గాంధీ జయంతి వేడుకలను నిర్మల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను మాట్లాడుతూ.. అహింసాయుత పద్ధతుల్లో స్వాతంత్ర్య పోరాటం చేసి భారతావని స్వేచ్చా వాయువులు పీల్చేలా చేసిన ఘనత మహాత్మాగాంధీదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యన్నగారి పోశెట్టి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చరణ్ మౌర్య, ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు డి.సంతోష్, పట్టణ మైనార్టీ చైర్మన్ ఎంఏ మతిన్, నాయకులు జింకసూరి, చిరంజీవి, రవి, హర్షద్ పటాన్, మానూరి సాయి, మీనాజ్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News