ఎంబీబీఎస్ విద్యార్థినికి చేయూత..

ముధోల్ ఇంటలెక్చవల్ ఫోరమ్ మనగుడి-మనబడి చైర్మన్ బద్దం భోజారెడ్డి ఇటివల కుబీర్ మండలంలోని సిర్పేలి గ్రామానికి...Financial assistance for MBBS student

Update: 2022-12-06 12:13 GMT

దిశ, ముధోల్: ముధోల్ ఇంటలెక్చవల్ ఫోరమ్ మనగుడి-మనబడి చైర్మన్ బద్దం భోజారెడ్డి ఇటివల కుబీర్ మండలంలోని సిర్పేలి గ్రామానికి చెందిన దళిత అమ్మాయి సంకీర్తనకు మల్లారెడ్డి కాలేజిలో ఎంబీబీఎస్ సీటు దక్కగా ఫీజు చెల్లించలేని పరిస్థితి నెలకొని ఉందని తెలుసుకుని మంగళవారం రూ.10,000 ఆర్థిక సాయం చేశారు. చదువులో ఆటంకం రాకూడదనే ఉద్దేశంతో తన వంతు సహాయంగా నగదు రూపంలో రూ. 10,000 అందించానని భోజారెడ్డి పేర్కొన్నారు. ఆపన్న హస్తం కోసం ఎంబీబీఎస్ విద్యార్థిని ఎదురు చూపు అనే శీర్షిక దిశ పత్రికలో మొదటగా ప్రచురితంకాగా, క్రమంగా అన్ని పత్రికల్లో ప్రచురితమయి ఆర్థిక సహాయానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబీకులు దాతా బోజారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News