నాగోబా జాతరలో కీలక ఘట్టం.. ఆ నీళ్లతో దేవతకు మెస్రం వంశీయుల పూజ

ఆదిలాబాద్ నాగోబా జాతరలో కీలక ఘట్టం ప్రారంభమైంది.

Update: 2024-02-05 06:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ నాగోబా జాతరలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఇంద్రవెల్లిలో ఇంద్రాయి దేవతకు మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కలమడుగు నుంచి గోదావరి నీళ్లతో మెస్రం వంశీయులు ఆలయానికి వచ్చారు. ముందుగా ఇంద్రాయి దేవతకు వారు నైవేద్యం పెట్టారు. పూజల అనంతరం ఇవాళ రాత్రి ఇంద్రవెల్లి నుంచి మెస్రం వంశీయులంతా కేస్లాపూర్ వెళ్లానున్నారు. నాగోబా ఆలయ సమీపంలోని మర్రి చెట్టు వద్దకు వెళ్లి వారు వెంట తీసుకొచ్చిన గోదావరి గంగా జలాన్ని చెట్టుపై భద్రంగా పెట్టనున్నారు.

కాగా, నాగోబా జాతరలో తరతరాలుగా వస్తున్న ఆచార, సాంప్రదాయాలను మెస్రం వంశీయులు పాటిస్తూ వస్తున్నారు. మహాపూజ అంకురార్పన నుంచి మొదలు ముగింపు వరకు 22 కితల వారు భాగస్వాములు అవుతారు. ఒక్కో కితకు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అందరి సలహాలు, సూచనల సమన్వయంతో సాంప్రదాయ పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ మహాపూజతోపాటు ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నీ నాగోబా ఆలయ పీఠాధిపతి పటేల్ ఆధ్వర్యంలో జరుగుతాయి.

Tags:    

Similar News