గ్రేటర్‌లో 60.92 లక్షల విద్యుత్ కనెక్షన్లు.. రికార్డు స్థాయి కరెంట్ వినియోగం

గ్రేటర్ పరిధిలో విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Update: 2024-05-02 02:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పరిధిలో విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం కరెంట్ కనెక్షన్ల సంఖ్య 60.92 లక్షలకు చేరుకుంది. ఇందులో గృహావసరాలకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 50.14 లక్షలుగా ఉంది. గ్రేటర్ పరిధిలో మూడు జోన్లు, తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. జోన్లలో మెట్రో జోన్, రంగారెడ్డి జోన్, మేడ్చల్ జోన్. కాగా మెట్రో జోన్ పరిధిలో బంజారాహిల్స్ సర్కిల్ , సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్స్ వస్తాయి. రంగారెడ్డి జోన్ పరిధిలో సైబరాబాద్, సరూర్ నగర్, రాజేంద్ర నగర్ సర్కిళ్లు ఉంటాయి. అలాగే మేడ్చల్ జోన్ పరిధిలో మేడ్చల్, హబ్సిగూడ జోన్లు ఉంటాయి.

విద్యుత్ కనెక్షన్లతో పాటు కరెంట్ వాడకం కూడా నగరంలో భారీగా పెరిగింది. 2023-23 మార్చి, ఏప్రిల్‌లో కరెంట్ వినియోగం 1 శాతంలోపే ఉండగా 2023-24 మార్చి, ఏప్రిల్‌లో వినియోగం 20 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో 28 ఏప్రిల్ 2022లో గరిష్ట విద్యుత్ వినియోగం 3435 మెగావాట్లు నమోదవ్వగా 19 మే 2023లో 3756 మెగావాట్లకు చేరకుంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 30న గరిష్ట విద్యుత్ వినియోగం 4214 మెగావాట్లకు చేరుకుంది. ఇది 88.75 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. కాగా సరిపడా విద్యుత్ ఉందని, ఎంత పీక్ డిమాండ్ వచ్చినా సరఫరా చేస్తామని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. అధికారులు, సిబ్బంది సైతం సరఫరాలో అంతరాయం లేకుండా విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నెల         జీహెచ్ఎంపీ 2022          జీహెచ్ఎంపీ 2023          పెరుగుదల శాతం

మార్చి      57.45 మి.యూ                 57.84 మి.యూ                0.68శాతం

ఏప్రిల్     66.16 మి.యూ                 66.80 మి.యూ                0.97శాతం


నెల                 జీహెచ్ఎంపీ 2023           జీహెచ్ఎంపీ 2024             పెరుగుదల శాతం

మార్చి             57.84 మి.యూ                 72.02 మి.యూ                   24.52శాతం

ఏప్రిల్             66.8 మి.యూ                   79.93 మి.యూ                  19.66శాతం

Similar News