Ram Lalla : బాల రాముని సూర్య తిలకం కోసం ప్రత్యేక టెక్నాలజీ..

నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2024-04-17 08:38 GMT

దిశ వెబ్ డెస్క్: నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాగా అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట జరిగిన తరువాత వచ్చిన రాములవారి తొలి పుట్టిన రోజు ఈ రోజు. దీనితో అయోధ్యలో బాల రాముని పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. వేకువ జాము నుండే స్వామివారికి సేవలు మొదలైయ్యాయి.

శ్రీరామ నవమి సందర్భంగా చేసిన అలంకరణలో బాల రాముడు కనులకింపుగా కనబడుతున్నారు. ఇక బాలరాముని అలంకరణలో ఆయన నుదుటిపై మెరిసిన సూర్య తిలకం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి నుండిపై ప్రసరించేలా అధికారులు ఏర్పాటు చేశారు. దీని కోసం సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక టెక్నాలజీని రూపొందించింది.

కాటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాల అమర్చడం ద్వారా రామమందిరం మూడవ అంతస్తునుండి గర్భగుడిలోని బాలరాముని విగ్రహం వరకు కాంతి ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఈ టెక్నాలజీలో ఎటువంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్ వాడాడలేదని సీబీఐఆర్ వెల్లడించింది. 

Tags:    

Similar News