రూ. 10,000 తగ్గింపుతో లభిస్తున్న Realme స్మార్ట్‌ఫోన్

త్వరలో రానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్-2023 సేల్‌‌కు ముందు ‘Realme GT నియో 3T’ స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది.

Update: 2023-05-01 13:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో రానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్-2023 సేల్‌‌కు ముందు ‘Realme GT నియో 3T’ స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. సెప్టెంబర్ 2022 లో ఇండియాలో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ. 29,999 ఉండగా, ఇప్పుడు రూ. 10,000 తగ్గింపుతో రూ. 19,999లకే ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంది. GT నియో 3T ఫోన్ 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా పనిచేస్తుంది. మొదట్లో Android 12తో వచ్చినప్పటికి డిసెంబర్‌లో Android 13-ఆధారిత Realme UI 4.0కి అప్‌డేట్ అయింది. ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 16MP కెమెరా ఉంది. ఇది 80W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 12 నిమిషాల్లో ఫోన్‌ను 50 శాతానికి చార్జ్ చేయగలదని Realme పేర్కొంది.

Tags:    

Similar News