50MP సెల్ఫీ కెమెరాతో Vivo కొత్త స్మార్ట్‌ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Vivo V30e’.

Update: 2024-05-02 11:39 GMT

దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Vivo V30e’. గురువారం నాడు మార్కెట్లోకి లాంచ్ చేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. దీనికి మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తామని కంపెనీ ప్రకటించింది. ఫోన్ 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 27,999. 8GB RAM + 256GB ధర రూ. 29,999. సిల్క్ బ్లూ, వెల్వెట్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మే 9 నుంచి కంపెనీ అధికారిక స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటెల్ అవుట్‌లెట్ల ద్వారా అమ్మకానికి ఉంటుంది. కొనుగోలు సమయంలో ICICI, SBI, IndusInd, IDFC బ్యాంకు కార్డులపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు.


Vivo V30e స్పెసిఫికేషన్స్

* 6.78-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ డిస్‌ప్లే.

* 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 nits పీక్ బ్రైట్‌నెస్.

* ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14పై రన్ అవుతుంది.

* స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC ద్వారా పనిచేస్తుంది.

* బ్యాక్ సైడ్ 50MP సోనీ సెన్సార్+8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది.

* ముందు సెల్ఫీల కోసం 50MP కెమెరాను అందించారు.

* ముందు, వెనుక రెండు కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.

* 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని అమర్చారు.

Similar News