ఆటోమెటిక్‌గా Windows 11 కొత్త వెర్షన్‌కు అప్‌డేట్

మైక్రోసాఫ్ట్ తన వినియోగదారులకు కీలక విషయాన్ని తెలిపింది. Windows 11 ఉపయోగిస్తున్న వారికి కొత్త వెర్షన్ అప్‌డేట్‌ను ప్రకటించింది.

Update: 2023-01-29 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ తన వినియోగదారులకు కీలక విషయాన్ని తెలిపింది. Windows 11 ఉపయోగిస్తున్న వారికి కొత్త వెర్షన్ అప్‌డేట్‌ను ప్రకటించింది. Windows 11 ఒరిజినల్ వెర్షన్‌ 21H2 వాడుతున్న వారికి దాని లేటెస్ట్ వెర్షన్ 22H2 లేదా "2022 అప్‌డేట్"కి ఆటోమెటి‌క్ గా అప్‌గ్రేడ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.


''Windows 11, వెర్షన్ 21H2 హోమ్, ప్రో ఎడిషన్‌లు వినియోగదారులు కొత్త వెర్షన్ 22H2కి ఆటోమెటి‌గ్ గా అప్‌గ్రేడ్ అవుతారు. Windows 10 నుండి, ఏ విధంగా అప్‌డేట్ అయ్యారో, అదే విధంగా Windows 11 22H2 వెర్షన్‌కు అప్‌డేట్ అవుతారని'' Microsoft పేర్కొంది. వినియోగదారులు వెంటనే Windows 11, వెర్షన్ 22H2ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, విండోస్ అప్‌డేట్ సెట్టింగ్‌లను ఓపెన్ చేసి కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది.

Similar News