YouTube వీడియోలకు AI ఫీచర్

వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌లో కొత్తగా మరో ఫీచర్‌ను తీసుకురానున్నారు.

Update: 2023-11-08 11:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌లో కొత్తగా మరో ఫీచర్‌ను తీసుకురానున్నారు. వీడియోలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, కంటెంట్ కోసం సిఫార్సులు వంటి వాటికి ఆన్సర్ ఇవ్వడానికి కృత్రిమ మేధస్సు (AI)ని సిద్ధం చేస్తున్నారు. వీడియో క్రింద ‘ఆస్క్’ అనే ఆప్షన్ ద్వారా వీడియో గురించి ప్రశ్నలు అడగడం లేదా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి AI టూల్స్ ద్వారా సమాధానాలు ఇస్తారు. దీనిని ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారులకు అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అమెరికాలోని YouTube ప్రీమియం మెంబర్స్‌కు వచ్చే అవకాశం ఉంది. AI తో జరిగే చాటింగ్ కూడా ఈజీగా యూజర్లకు అర్థమయ్యేలా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News