రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.. ఆర్టికల్ 356 విధించండి..

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ఎన్టీఆర్ భవన్, టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటి విధ్వంసం పై గవర్నర్ బీబీ హరిచందన్‌కు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బీబీ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై […]

Update: 2021-10-21 11:25 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ఎన్టీఆర్ భవన్, టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటి విధ్వంసం పై గవర్నర్ బీబీ హరిచందన్‌కు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బీబీ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి గురించి గవర్నర్‌కు తెలియజేశామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని గవర్నర్‌కు తెలియజేశామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో ఆర్టికల్ 356 విధించాలని డిమాండ్ చేశారు.

తమపైనే దాడిచేసి, తమపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్‌పై దాడి జరిగిన సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అక్కడ లేరన్నారు. అయినప్పటికీ లోకేశ్‌పై హత్యాయత్నం కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడి చేసి.. తిరిగి తమపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక అసమర్థ డీజీపీ ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ముందు పలు డిమాండ్లు ఉంచామని.. తమ ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దాడులపై ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంశాఖ మంత్రి అమిత్‌షాలతో త్వరలోనే భేటీ అయి దారుణాలను వివరిస్తామని అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు.

Tags:    

Similar News