టాటా స్టీల్ నికర నష్టం రూ. 4,609 కోట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఉక్కు సంస్థ టాటా స్టీల్(Tata Steel) 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఊహించిన దానికంటే అత్యధికంగా రూ. 4,609.17 కోట్ల నికర నష్టాల(Net losses)ను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం(Net profit) రూ. 695.19 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 29.65 శాతం తగ్గి రూ. 25,288.51 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 35,947.11 కోట్లుగా […]

Update: 2020-08-13 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఉక్కు సంస్థ టాటా స్టీల్(Tata Steel) 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఊహించిన దానికంటే అత్యధికంగా రూ. 4,609.17 కోట్ల నికర నష్టాల(Net losses)ను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం(Net profit) రూ. 695.19 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 29.65 శాతం తగ్గి రూ. 25,288.51 కోట్లకు తగ్గింది.

గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 35,947.11 కోట్లుగా నమోదైంది. కొవిడ్-19( kovid-19) వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా సమీక్షించిన త్రైమాసికం ఓ కంపెనీ తయారీ, పంపిణీ కార్యకలాపాలు గణనీయమైన స్థాయిలో తగ్గాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో తెలిపింది. ఈ త్రైమాసిక చివరి భాగంలో ఆంక్షలు తొలగి పరిమితంగానైనా కార్యకలాపాలు జరిగాయని, సరఫరా గొలుసు అంతరాయాల నుంచి కొంత కోలుకుందని కంపెనీ తెలిపింది. అయినప్పటికీ, అమ్మకాల పరిమాణం ప్రతికూలంగా ప్రభావితమైందని కంపెనీ పేర్కొంది. అయితే, సంస్థ ఆర్థిక ఫలితాల(Financial results)ను మెరుగు పరిచేందుకు, సామర్థ్యాన్ని పెంచేందుకు భవిష్యత్తు ఆర్థిక పరిస్థితుల్లో (Economic situation) మార్పులను పర్యవేక్షిస్తూనే తగిన చర్యలు తీసుకోనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News