ఓటీటీ లవర్స్‌కు తరుణ్ మంత్ర.. "Bingeit App"

మీరు సినీ ప్రేమికులా? కానీ ఓటీటీలో మీకు నచ్చిన కంటెంట్ దొరకడం లేదా? మీరు చూడాలనుకున్న సినిమా లేదా సిరీస్.. ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ప్రసారం అవుతుందో తెలియడం లేదా? అసలు ఓటీటీలో ఏం చూడాలో తేల్చుకోలేక పోతున్నారా? వీటన్నిటికి సమాధానం చెప్పే ఓకే ఒక్క యాప్ ‘Bingeit’. దర్శకుడు తరుణ్ భాస్కర్ మన ముందుకు తీసుకొచ్చిన ఈ యాప్.. ఓటీటీలో ‘ఏం చూడాలి? ఎక్కడ చూడాలి’ వంటి సమస్యలకు పరిష్కారాన్ని అందించనుంది. భారతదేశంలో తయారైన […]

Update: 2020-08-01 02:17 GMT

మీరు సినీ ప్రేమికులా? కానీ ఓటీటీలో మీకు నచ్చిన కంటెంట్ దొరకడం లేదా? మీరు చూడాలనుకున్న సినిమా లేదా సిరీస్.. ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ప్రసారం అవుతుందో తెలియడం లేదా? అసలు ఓటీటీలో ఏం చూడాలో తేల్చుకోలేక పోతున్నారా? వీటన్నిటికి సమాధానం చెప్పే ఓకే ఒక్క యాప్ ‘Bingeit’.

దర్శకుడు తరుణ్ భాస్కర్ మన ముందుకు తీసుకొచ్చిన ఈ యాప్.. ఓటీటీలో ‘ఏం చూడాలి? ఎక్కడ చూడాలి’ వంటి సమస్యలకు పరిష్కారాన్ని అందించనుంది. భారతదేశంలో తయారైన ఈ యాప్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ, సిరీస్ అభిమానులకు చక్కగా ఉపయోగపడనుంది.

బింజేట్ గురించి:

1. ఓటీటీ కంటెంట్ గురించి సమగ్రమైన సమాచారం పొందడం
2. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి రికమెండేషన్స్ పొందవచ్చు
3. మీకు నచ్చిన కంటెంట్ స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదో తెలుసుకోవచ్చు
4. కంటెంట్ ఇష్టపడే వ్యక్తులతో కనెక్ట్ అవ్వొచ్చు.

IOS & Android రెండింటిలోనూ Bingeit యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఈ కొత్త యాప్ ఆలోచన చేసిన తరుణ్ భాస్కర్‌కు సోషల్ మీడియాలో భారీ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లు లేక ఎలాగూ ఓటీటీలోనే మూవీ లవర్స్ కాలం గడుపుతుండగా ఈ యాప్ సూపర్‌గా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News