వైన్‌షాప్ వద్ద కత్తులతో దాడి..!

దిశ, వెబ్‎డెస్క్ : సూర్యాపేట జిల్లా స్థానిక ఖమ్మం క్రాస్‎రోడ్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వివరాల్లోకి వెళ్తే.. వైన్‎షాప్ వద్ద కొందరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో చర్చ్ కాంపౌండ్‎కు చెందిన సుజన్ కుమార్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచారు. ఈ ఘర్షణలో మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి […]

Update: 2020-10-26 01:59 GMT

దిశ, వెబ్‎డెస్క్ : సూర్యాపేట జిల్లా స్థానిక ఖమ్మం క్రాస్‎రోడ్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వివరాల్లోకి వెళ్తే.. వైన్‎షాప్ వద్ద కొందరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో చర్చ్ కాంపౌండ్‎కు చెందిన సుజన్ కుమార్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచారు. ఈ ఘర్షణలో మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు తెలియాల్సి వుంది.

Tags:    

Similar News