మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన సుప్రీంకోర్టు

Update: 2023-04-25 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భారత రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఆటగాళ్లు చేసిన తీవ్రమైన ఆరోపణలను పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం నుండి ప్రతిస్పందన కోరింది.

లైంగిక వేధింపులపై ఆధారాలు ఉన్నా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. బాధితుల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు.

Tags:    

Similar News