ఆల్ ది బెస్ట్ రహానే..: సౌరవ్ గంగూలీ

టీమ్ ఇండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఐపీఎల్-16లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొడుతున్నాడు. తన శైలికి భిన్నంగా మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తాచాటుతున్నాడు.

Update: 2023-05-06 16:56 GMT

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఐపీఎల్-16లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొడుతున్నాడు. తన శైలికి భిన్నంగా మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తాచాటుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో పాల్గొనే భారత్‌ జట్టుకు రహానే ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా రహానే తిరిగి జట్టులోకి రావడంపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. రహానే తనకు మొదటి నుంచి ఇష్టమే అని దాదా వ్యాఖ్యానించాడు. ‘భారత్‌ తరఫున అతను ఎన్నో మంచి ప్రదర్శనలు చేశాడు.

ప్రతిసారి అవకాశాలు రావు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తుది జట్టులో అతనికి చోటు దక్కితే కచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఆల్ ది బెస్ట్ రహానే’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. అలాగే, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కేఎల్ రాహుల్ దూరమవడంపై దాదా స్పందిస్తూ.. అతను ఐపీఎల్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమడం దురదృష్టకరమని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ కింద పడటంతో అతని తొడకు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో రహానే ఆడిన 7 మ్యాచ్‌‌ల్లో 181.48 స్ట్రైక్‌రేటుతో 245 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Tags:    

Similar News