Sachin Tendulkar: జిమ్ కార్బెట్ సఫారీలో లిటిల్ మాస్టర్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు.

Update: 2024-05-12 17:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. అటు స్నేహితులకు.. ఇటు కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయిస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. తాజాగా, లిటిల్ మాస్టర్ ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో సఫారీ చేశాడు. అయితే అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో త్రోబాక్ పోస్ట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సచిన్ ఆ పోస్టులో ‘జిమ్ కార్బెట్ సఫారీ అనేది పార్కులో నడవడమే కాదు.. ఇట్స్ ఏ రైడ్ ఇన్ ది వైల్డ్’ అని తన పోస్ట్‌కి క్యాప్షన్‌ కూడా పెట్టాడు. 

Full View

Tags:    

Similar News