జావెలిన్ త్రోయర్ శివపాల్‌పై నాలుగేళ్ల నిషేధం

డోప్ టెస్టులో దొరికిపోవడంతో సస్సెన్షన్‌లో ఉన్నా.. భారత - NADA suspends javelin thrower Shivpal Singh till 2025

Update: 2022-10-03 11:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: డోప్ టెస్టులో దొరికిపోవడంతో సస్సెన్షన్‌లో ఉన్నా.. భారత జావెలిన్ థ్రోయర్ శివపాల్ సింగ్‌పై వేటు పడింది. డోప్ టెస్టులో పాజిటివ్‌గా రావడంతో నాలుగేళ్ల పాటు ఆట నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. నేషనల్ డోపింగ్ ఏజెన్సీ కి చెందిన క్రమశిక్షణా సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్‌కి చెందిన 27 ఏళ్ల శివపాల్ సింగ్‌ టోక్యో ఒపింపిక్స్‌లో పాల్గొన్నాడు. డోప్ టెస్టులో దొరికిపోవడంతో ప్రస్తుతం నాలుగేళ్ల పాటు ఆటకు దూరం కానున్నాడు. 2025 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. అక్టోబర్ 21, 2021 నుంచి 2025 అక్టోబర్ చివరి వరకు నిషేధం అమలులో ఉండనుంది. 2019లో శివపాల్ సింగ్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ ఏడాదిలో NADA నిషేధానికి గురైన ఐదవ ప్లేయర్‌గా నిలిచాడు. టోక్యో ఒలింపియన్ కమల్‌ప్రీత్ కౌర్, ఎంఆర్‌ పూవమ్మ, స్పింటర్ ధనలక్ష్మీ శేఖర్, డిస్కస్ త్రోవర్ నవజీత్ కౌర్ ధిల్లన్‌లు డోపింగ్ కోడ్ ఉల్లంఘనల కారణంగా ఆటకు దూరమయ్యారు.

Similar News