Rohit Sharma : రోహిత్‌‌ ఒక్కడినే విమర్శించడం అన్యాయం: Harbhajan Singh

మాజీ క్రికెటర్లు సైతం అతని కెప్టెన్సీని విమర్శిస్తున్నారు.

Update: 2023-07-11 04:32 GMT

న్యూఢిల్లీ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు ఎక్కువయ్యాయి. మాజీ క్రికెటర్లు సైతం అతని కెప్టెన్సీని విమర్శిస్తున్నారు. అయితే, తాజాగా టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హిట్‌మ్యాన్‌కు మద్దతుగా నిలిచాడు. ‘రోహిత్ విషయంలో కొంత మంది కాస్త అతిగా చేస్తున్నారు. క్రికెట్ అనేది ఒక జట్టు ఆట. ఒక్క ఆటగాడే జట్టును ముందుకు తీసుకెళ్లలేడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా బాగా రాణించలేదు. నిజమే. దానికి గురించి మాట్లాడండి. కానీ, రోహిత్‌ను మాత్రమే విమర్శించడం అన్యాయం. అతను తెలివైన నాయకుడు. అతనితో కలిసి నేను ఆడాను. అతన్ని దగ్గరిగా చూశాను. ముంబై ఇండియన్స్ డెస్సింగ్ రూంలోనే కాదు.. టీమ్ ఇండియా డ్రెసింగ్‌ రూంలో కూడా. ఇటీవల వచ్చిన ఫలితాల ఆధారంగా అతడి కెప్టెన్సీపై ఓ అంచనాకు రావడం సరికాదు. రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడు. బీసీసీఐ అతనికి మద్దతుగా నిలవాలి. బీసీసీఐ మద్దతు ఉంటే స్వేచ్చగా పని చేసుకోవచ్చు’ అని హర్భజన్ సింగ్ చెప్పాడు.

Read more : ODI ప్రపంచ కప్ 2023.. టికెట్ ధరలు ఇవే

Tags:    

Similar News