IPL: ముంబై ఇండియన్స్ ఇంటిదారి పట్టడంపై అంబానీ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ చరిత్రలో ఈసారి ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన చేసింది. అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయి క్రీడాభిమానులకు షాకిచ్చింది.

Update: 2024-05-21 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో ఈసారి ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన చేసింది. అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయి క్రీడాభిమానులకు షాకిచ్చింది. మొత్తం 14 మ్యాచులు ఆడిన ముంబై.. కేవలం 4 మ్యాచుల్లోనే గెలుపొందింది. ఐపీఎల్‌లో ఐదు ట్రోఫీలు అందుకున్న ముంబై జట్టు ఇలా లీగ్‌లోనే ఇంటిదారి పట్టడాన్ని క్రీడాభిమానులు, ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. మరికొందరు కెప్టెన్‌గా రోహిత్‌ను మార్చడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది, హార్దిక్‌కు యాటిట్యూడ్ ఎక్కువని నెట్టింట్లో పోస్టులు పెట్టి ట్రోల్ చేశారు. ఇదిలా ఉండగా.. లీగ్ దశలోనే ముంబై ఇంటిదారి పట్టడంపై ఆ జట్టు ఓనర్ నీతా అంబానీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమను ఈ సీజన్ సంతృప్తి పర్చలేదని అన్నారు. ఇలా ఎందుకు జరిగిందో సమీక్షించుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని ముంబై ఇండియ‌న్స్‌కు చెందిన సోష‌ల్ మీడియా అకౌంట్‌లో వీడియోను షేర్ చేశారు. అనంతరం ప్లేయర్లను సత్కరించి.. సెండాఫ్ ఇచ్చారు.



 


Tags:    

Similar News