T20 వరల్డ్ కప్‌కు అతడిని తీసుకోకపోవడమే మంచింది.. ఇర్ఫాన్ పఠాన్

అక్టోబర్ 16 నుండి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2022-09-22 12:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 16 నుండి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలెంటెడ్ ప్లేయర్లకు స్థానం కల్పించకుండా ఫామ్‌లో లేని వారిని ఎంపిక చేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు. సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ షమీ, సిరాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ జట్టు సెలక్షన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్ కప్ కోసం సెలక్షన్ టీం ప్రకటించిన భారత్ జట్టు అత్యుత్తమైనదేనని.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే జట్టును ఎంపిక చేస్తారని తెలిపారు. ఇక యంగ్ స్పీడ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడమే మంచిదని పేర్కొన్నారు. అతడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని.. వరల్డ్ కప్ ఆడేంత అనుభవం అతడికి లేదని తెలిపాడు.

ఉమ్రాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇండియా ఏ టీమ్ తరుపున మరిన్ని మ్యాచులు ఆడి ఇంకా అనుభవం గడించాలని సూచించాడు. అతడు వయస్సు ఇంకా తక్కువేనని.. భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని అభ్రిపాపడ్డాడు. ఉమ్రాన్ చాలా టాలెంటెడ్ బౌలరని.. కానీ, గంటకు 150 కి. మి వేగంతో బంతులు వేసినప్పటికీ పరుగులు ఎక్కువ ఇవ్వడం అతడి బలహీనతగా మారిందని.. దానిని అధిగమించేదుకు ఉమ్రాన్ మరింత సాధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. 

Similar News