భారత మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్

భారత మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ హృషికేష్‌ కనిత్కర్‌ను బీసీసీఐ నియమించింది.

Update: 2022-12-06 14:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ హృషికేష్‌ కనిత్కర్‌ను బీసీసీఐ నియమించింది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉన్న రమేష్‌ పొవార్‌ ఇక నుంచి కొత్త రోల్‌లో కనిపించనున్నాడు. బీసీసీఐ అతన్ని నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీకి పంపించింది. రమేష్‌ పొవార్‌ స్పిన్‌ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌కు రెండు నెలల ముందు బోర్డు ఈ కీలక మార్పులు చేయడం గమనార్హం. అయితే టీ20 వరల్డ్‌కప్‌ ముగిసే వరకూ రమేష్‌ పొవార్‌‌ హెడ్‌ కోచ్‌గా ఉండాల్సి ఉన్నా.. బీసీసీఐ హఠాత్తుగా అతన్ని ఎన్సీఏకు పంపించింది. అయితే కొత్త హెడ్‌ కోచ్‌ ఎవరు అన్నది మాత్రం బోర్డు వెల్లడించలేదు. డిసెంబర్‌ 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు కూడా హెడ్‌ కోచ్‌గా ఎవరు వ్యవహరిస్తారన్నదానిపై స్పష్టత లేదు.

Similar News