రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌..

ఇంగ్లండ్‌ స్టార్‌ మహిళా క్రికెటర్‌ కేథరీన్‌ హెలెన్‌ స్కీవర్‌ బ్రంట్‌ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది.

Update: 2023-05-05 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌ స్టార్‌ మహిళా క్రికెటర్‌ కేథరీన్‌ హెలెన్‌ స్కీవర్‌ బ్రంట్‌ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగతున్నట్లు తెలిపింది. చివరిసారిగా ఫిబ్రవరిలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టగా.. 14 టెస్ట్‌ల్లో 51 వికెట్లు, 184 పరుగులు చేయగా.. 141 వన్డేల్లో 170 వికెట్లు, 1090 రన్స్ చేసింది. 112 టీ20ల్లో 114 వికెట్లు, 590 పరుగులు చేసింది. బ్రంట్‌ బౌలింగ్‌లోను అదరగొట్టింది.. టెస్ట్‌ల్లో 3 సార్లు, వన్డేల్లో 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది. ఇంగ్లండ్‌ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నాలుగు సార్లు ఎంపికైంది.

Tags:    

Similar News