శ్రీలంక చేతిలో పాక్ ఘోర పరాజయం.. దాదాపు కన్నీళ్లు పెట్టుకున్న Babar Azam

గురువారం కొలంబోలోని ప్రేమదాసలో జరిగిన సూపర్ 4 ఆసియా కప్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పాక్ ఘోర పరాజయం పాలైంది.

Update: 2023-09-15 03:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: గురువారం కొలంబోలోని ప్రేమదాసలో జరిగిన సూపర్ 4 ఆసియా కప్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పాక్ ఘోర పరాజయం పాలైంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంతో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సారి ఆసియా కప్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన పాక్ జట్టు కీలక మ్యాచ్ లో ఓడిపోయి ఫైనల్ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. మ్యాచ్ అనంతర ప్రెజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు అతను దాదాపు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కాగా ఈ విజయంతో శ్రీలంక జట్టు 11వ సారి ఆసియా కప్ ఫైనల్ చేరింది.

Tags:    

Similar News