గిల్ బ్యాటింగ్ లోపం ఇదే : Gautam Gambhir

టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో బ్యాటుతో రాణించడం లేదు.

Update: 2023-09-04 12:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో బ్యాటుతో రాణించడం లేదు. ఇక ఆసియా కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా దారుణంగా తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ గిల్ కాన్పిడెంట్‌గా కనిపించలేదు. ఈ నేపథ్యంలో గిల్ ఇన్నింగ్స్‌పై టీమిండియా దిగ్గజం గౌతం గంభీర్ స్పందించాడు. గిల్ బ్యాటింగ్‌లో టెక్నికల్‌గా సమస్యలు ఉన్నాయని.. వాటిని అతను సరిదిద్దుకుంటేనే రాణించ గలుగుతాడని అన్నాడు. లేదంటే ఇలాగే విఫలం అవుతూ ఉంటాడని అభిప్రాయపడ్డాడు.

పాక్‌తో మ్యాచులో గిల్ నిదానంగా ఆడాల్సి వచ్చిన మాట వాస్తవమే అని గంభీర్ అన్నాడు. కానీ బ్యాట్, ప్యాడ్ మధ్య అంత గ్యాప్ వదలడం మాత్రం కరెక్ట్ కాదన్నాడు. భవిష్యత్తులో గిల్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని సలహా ఇచ్చాడు. 'అవతలి ఎండ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ముగ్గురూ ఔటైపోయారు. అందుకని తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా గిల్ ఆడేందుకు ప్రయత్నించాడని నా అభిప్రాయం' అని గంభీర్ చెప్పాడు.

'అదే సమయంలో అతని బ్యాటింగ్‌లో గిల్ బ్యాటింగ్‌లో సాంకేతిక లోపం కూడా ఉన్నట్లు కనిపించింది. ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పేందుకు గిల్ ప్రయత్నించాడు. అతను ఔటయింది కూడా చాలా మంచి డెలివరీకి. కానీ బ్యాట్, ప్యాడ్ మధ్య అంత గ్యాప్ వదిలి ఆడుతుంటే.. క్వాలిటీ బౌలర్లు దాన్ని కచ్చితంగా టార్గెట్ చేస్తారు. దీనిపై గిల్ కచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది' అని గంభీర్ సలహా ఇచ్చాడు.

Tags:    

Similar News