WTC Final 2023: ఆసీస్ కీలక నిర్ణయం.. బ్యాక్‌రూమ్‌ కన్సల్టెంట్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్

WTC Final 2023 మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-06-05 17:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023 మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాక్‌రూమ్‌ కన్సల్టెంట్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను నియమించిది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో కోచ్‌గా ఫ్లవర్‌కు అపారమైన అనుభవం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2009 నుంచి 2014 వరకు ఇంగ్లండ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఫ్లవర్‌ పనిచేశాడు. అంతకుముందు ఇంగ్లీష్‌ జట్టుకు డైరక్టర్‌గా పనిచేశాడు. అతడు హెడ్‌కోచ్‌గా ఉన్నప్పడు ఇంగ్లండ్‌ జట్టు మూడు సార్లు యాషెస్‌ విజేతగా నిలిచింది.

అదే విధంగా ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఫ్లవర్‌ ఉన్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌లో కూడా ఆసీస్‌ జట్టుకు ఫ్లవర్‌ బ్యాక్‌రూమ్‌ కన్సల్టెంట్‌గా ఉండే అవకాశం ఉంది. కాగా జూన్‌ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌ మైదానంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Tags:    

Similar News