రేపు కేరళలోకి నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలో ఎంట్రీ ఎప్పుడంటే!

దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాలు ఈసారి త్వరగానే దేశంలోకి ప్రవేశించనున్నట్లు IMD(భారత వాతవరణ శాఖ) వెల్లడించింది. ఏటా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి పవనాలు ఈసారి మే 31వ తేదీన కేరళ రాష్ట్రంలో ప్రవేశించనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రాకతో కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకో 10 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, […]

Update: 2021-05-30 05:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాలు ఈసారి త్వరగానే దేశంలోకి ప్రవేశించనున్నట్లు IMD(భారత వాతవరణ శాఖ) వెల్లడించింది. ఏటా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి పవనాలు ఈసారి మే 31వ తేదీన కేరళ రాష్ట్రంలో ప్రవేశించనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రాకతో కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకో 10 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలంగాణలో ఖరీఫ్ కోసం రైతులు భూములను దుక్కిదున్ని చదును చేస్తున్నారు. తొలకరి జల్లులు పడగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు వేసేందుకు రైతులు ముందుగానే అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News