ఔరంగజేబ్ ఆత్మ కాంగ్రెస్‌లోకి ప్రవేశించింది: యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్

వారసత్వ పన్ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆత్మ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిందన్నారు.

Update: 2024-05-18 10:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వారసత్వ పన్ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆత్మ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిందన్నారు. వారసత్వపు పన్ను ఔరంగజేబు విధించిన జిజియా పన్ను లాంటిదని అభివర్ణించారు. ముస్లిమేతర పౌరులపై ఔరంగాజేబు జిజియా పన్ను విధించారని గుర్తు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్ పట్టణంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. బీజేపీ కేవలం అధికారం కోసమే ఎన్నికల్లో పోటీచేయడం లేదని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం కోసమేనని తెలిపారు. మోడీ మరోసారి ప్రధాని అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదని నొక్కిచెప్పారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల మనోభావాలకు ప్రతీక అని కొనియాడారు. విపక్ష కూటమి అధికారంలోకి రాకుండా రాముడే భరోసా ఇస్తాడన్నారు. 2014కు ముందు ప్రతి హిందువుల పండుగకు ముందు గొడవలు జరిగేవని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. ‘పాకిస్థాన్‌కు అనుకూలమైన వారు ఆ దేశానికి వెళ్లి అడుక్కోవాలని నేను కోరుతున్నా. ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపించే వారికి భారత్‌లో స్థానం లేదు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీతోనే దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News