ఎంఎస్ఎంఈలకు ఆ స్టోర్ అవసరం : సీఐఏ

దిశ, వెబ్‌డెస్క్: సూక్ష్మ, చిన్న పరిశ్రమల సంఘం కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(సీఐఏ) ఎంఎస్ఎంఈలకు తక్కువ ఖర్చుతో ముడి పదార్థాలను అందించేందుకు ‘సరసరమైన ధర’ల దుకాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. గతవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌కు సీఐఏ ఈ అంశంపై వివరించినట్టు, ప్రస్తుతం ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. ముడి పదార్థాలు సకాలంలో, సరసమైన ధరలకు లభ్యత అని సీఐఏ తెలిపింది. ‘వ్యాపారులు ఎక్కువగా తమకు ఇష్టమైన ధరల్లో మార్కెట్లో విక్రయాలు నిర్వహిస్తున్నారు. నేషనల్ […]

Update: 2021-02-21 10:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూక్ష్మ, చిన్న పరిశ్రమల సంఘం కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(సీఐఏ) ఎంఎస్ఎంఈలకు తక్కువ ఖర్చుతో ముడి పదార్థాలను అందించేందుకు ‘సరసరమైన ధర’ల దుకాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. గతవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌కు సీఐఏ ఈ అంశంపై వివరించినట్టు, ప్రస్తుతం ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. ముడి పదార్థాలు సకాలంలో, సరసమైన ధరలకు లభ్యత అని సీఐఏ తెలిపింది. ‘వ్యాపారులు ఎక్కువగా తమకు ఇష్టమైన ధరల్లో మార్కెట్లో విక్రయాలు నిర్వహిస్తున్నారు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(ఎన్ఎస్ఐసీ) సూక్ష్మ సంస్థలకు సరసమైన ధరల్లో ముడి పదార్థాలు లభించేలా కొత్త విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని’ సీఐఏ కన్వీనర్ కె రఘునాథన్ చెప్పారు.

అంతేకాకుండా, 2022 మార్చి వరకు అన్ని సంస్థలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మూడో డిమాండ్‌గా, ఎంఎస్ఎంఈల కోసం బ్యాంకుల్లో ‘ట్రేడ్’ అకౌంట్లు(సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు) తెరిచేందుకు అనుమతివ్వాలని కోరింది. కార్పొరేట్లు, పీఎస్‌యూ, ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విభాగాలకు సరఫరాకు మధ్యవర్తిగా వ్యవహరించేలా బ్యాంకులు ఆలస్యం చేయని విధానం అవసరమని అభ్యర్థించింది. ఎంఎస్ఎంఈలకు నిర్ణీత తేదీల్లో పరిష్కారమయ్యేలా చూడాలని సీఐఏ కోరింది. కాగా, ఎంఎస్ఎంఈలలో ఉన్న అన్ని పెట్టుబడులకు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను రద్దు చేయాలని గతంలోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఫైనాన్స్‌కు చేసిన డిమాండ్ పెండింగ్‌లో ఉందని సీఐఏ వెల్లడించింది.

Tags:    

Similar News