వచ్చే ఏడాది నుంచి స్కోడా కార్ల ధరలు పెంపు!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా వచ్చే ఏడాదిలో తన కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరగనున్న నేపథ్యంలో 2021, జనవరి 1 నుంచి కార్ల ధరలను 2.5 శాతం వరకు పెంచాలని చూస్తున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. ఇప్పటికే దేశీయ ప్రముఖ కార్ల దిగ్గజాలన్నీ వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలను పెంచడంపై ప్రకటనలిచ్చాయి. ముఖ్యంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, వస్తువుల వ్యయం అధికమవడమే దీనికి కారణమని […]

Update: 2020-12-29 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా వచ్చే ఏడాదిలో తన కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరగనున్న నేపథ్యంలో 2021, జనవరి 1 నుంచి కార్ల ధరలను 2.5 శాతం వరకు పెంచాలని చూస్తున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. ఇప్పటికే దేశీయ ప్రముఖ కార్ల దిగ్గజాలన్నీ వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలను పెంచడంపై ప్రకటనలిచ్చాయి.

ముఖ్యంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, వస్తువుల వ్యయం అధికమవడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. ఇటీవల గత కొంతకాలంగా అంతర్జాతీయంగా వస్తువుల ధరల్లో గణనీయమైన పెరుగుదల, విదేశీ మారకపు రేట్లలో మార్పుల కారణ్నగా ఉత్పత్తికి ఇన్‌పుట్ వస్తువుల ధరలు పెరిగాయని, ఈ సవాళ్లను అధిగమించేందుకు ధరలను పెంచక తప్పటంలేదని స్కోడా ఇండియా తెలిపింది.

Tags:    

Similar News