అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో మొదటి అరెస్ట్

కేంద్ర హోంమంత్రి అమిత్ మార్పింగ్ వీడియో కేసులో మొదటి అరెస్ట్ జరిగింది.

Update: 2024-04-29 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ మార్పింగ్ వీడియో కేసులో మొదటి అరెస్ట్ జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు తీసేస్తామనే వీడియోను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏకంగా కేంద్ర హోంమంత్రికి చెందిన మార్ఫింగ్ వీడియోను పోస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. కాగా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేశారు. అలాగే మే 1 విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసినందుకు కాంగ్రెస్ సీనియర్ నేత రీతోమ్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పింగ్ వీడియో కాంగ్రెస్ పార్టీ నేతల మెడకు చుట్టుకుంది.

Similar News