చెరువులను తలపిస్తున్న సిరిపురం రోడ్లు

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం పరిధిలోని సిరిపురం గ్రామంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని వీధులన్నీ మూడు, నాలుగు అడుగులలోతుకు చేరి ఇండ్లలోకి వస్తున్నాయన్నారు. దీని కారణంగా పలువురు డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేకసార్లు అధికారులు చెప్పినా ఏమాత్రం స్పందించలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, మురుగు నీరు రాకుండా […]

Update: 2020-09-04 07:15 GMT

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం పరిధిలోని సిరిపురం గ్రామంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని వీధులన్నీ మూడు, నాలుగు అడుగులలోతుకు చేరి ఇండ్లలోకి వస్తున్నాయన్నారు.

దీని కారణంగా పలువురు డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేకసార్లు అధికారులు చెప్పినా ఏమాత్రం స్పందించలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, మురుగు నీరు రాకుండా చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News