మీ ఆయన లేడా? రాత్రికి రా.. సింగరేణి కార్మికనేత ఆడియో లీక్

దిశ, ఇల్లందు టౌన్: హలో.. తెల్లవారు జామున కలలోకి వచ్చావ్.. చాలా డిస్ట్రబ్ చేశావ్.. మా ఇంటికి ఎప్పుడు వస్తావ్.. మధ్యాహ్నమా.. రాత్రికా.. మీ ఆయన లేడా.. అయితే రాత్రి 7 గంటలకు రా.. అంటూ బొగ్గుగని కార్మిక సంఘం నేత సింగరేణి ఉద్యోగి భార్యపై వేధింపులకు పాల్పడ్డాడు. కార్మికుల సమస్యలపై గలం విప్పాల్సిన ఆ నేత.. బాధ్యతలు మరిచి తన కోరిక తీర్చాలని ఉద్యోగి సతీమణితో ప్రాధేయపడ్డడం కలకలం సృష్టిస్తోంది. అతడి వేధింపులు తాళలేని సదరు […]

Update: 2021-02-24 06:17 GMT

దిశ, ఇల్లందు టౌన్: హలో.. తెల్లవారు జామున కలలోకి వచ్చావ్.. చాలా డిస్ట్రబ్ చేశావ్.. మా ఇంటికి ఎప్పుడు వస్తావ్.. మధ్యాహ్నమా.. రాత్రికా.. మీ ఆయన లేడా.. అయితే రాత్రి 7 గంటలకు రా.. అంటూ బొగ్గుగని కార్మిక సంఘం నేత సింగరేణి ఉద్యోగి భార్యపై వేధింపులకు పాల్పడ్డాడు. కార్మికుల సమస్యలపై గలం విప్పాల్సిన ఆ నేత.. బాధ్యతలు మరిచి తన కోరిక తీర్చాలని ఉద్యోగి సతీమణితో ప్రాధేయపడ్డడం కలకలం సృష్టిస్తోంది. అతడి వేధింపులు తాళలేని సదరు అధికారి భార్య నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో అతడి కామలీలలు వెలుగులోకి వచ్చాయి.

సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఉపరితలగనిలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి స్థానికంగా ఇల్లందులో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అదే కాలనీలో నివాసముంటున్న అధికార పార్టీకి అనుబంధంగా ఉంటున్న కార్మిక సంఘం నేత సదరు ఉద్యోగి భార్యపై కన్నేశాడు. తరచుగా ఫోన్ చేస్తూ అసభ్యకర సంభాషణలు చేసేవాడు. మొదట మౌనంగా భరిస్తూ వచ్చిన బాధితురాలు చివరికి అతడి వేధింపులు తాళలేక ఇల్లందు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.

(మహిళల గౌరవాన్ని కాపాడే దిశగా ఆడియో క్లిప్ ని పెట్టడం లేదు)

రికార్డింగ్ ముచ్చట్లు :

సదరు నేత : నువ్వు నా కలలోకి వచ్చావు.
బాధితురాలు : ఎందుకు అంకుల్
సదరు నేత : తెలీదు, తెల్లవారు జామున వచ్చి డిస్టబ్ చేశావు
బాధితురాలు : నేను ఏం చేశాను అంకుల్
సదరు నేత : మధ్యాహ్నం ఇంటికి రా చెబుతాను
బాధితురాలు : ఫోన్‌లోనే చెప్పండి పర్లేదు..
సదరు నేత : ఫోన్ లో చెప్పలేను .. నాకు కొంచెం భయం.. రికార్డింగ్స్ చేస్తున్నారు కదా ఈ మధ్య.. సేఫ్టీ కాదు.
బాధితురాలు : ఏం కాదు అంకుల్, నా ఫోన్ లో అలాంటి ఆప్షన్ లేదు. పాత ఫోన్
సదరు నేత : పరవాలేదంటవా అయితే, మదర్ ప్రామిస్, నామీద ఒట్టు వేయు.
బాధితురాలు : చెప్పండి పర్లేదు. అలా ఏం కాదు.
సదరు నేత : ఇంట్లో ఎవరూ ఉండరు, మధ్యాహ్నం రా..?
బాధితురాలు : సాయంత్రం వస్తాను..
సదరు నేత : మీ ఆయన లేడా?
బాధితురాలు : లేదు అంకుల్, ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తున్నాడు.
సదరు నేత : అవునా అయితే ఒకే, వచ్చేయ్ మరి.
బాధితురాలు : సరే అంకుల్ వస్తాను..

సారు సమన్వయంతో కేసు కాంప్రమైజ్..

బాధితురాలి గోడును విన్న పోలీసులు ఫిర్యాదు స్వీకరించినా కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్మికసంఘం నేతను స్టేషన్ కు పిలిపించిన పోలీస్, పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా పంచాయతీ జరిపినట్లు తెలుస్తోంది. ఇరువర్గాలను సమన్వయం చేసిన సదరు పోలీస్ అధికారి నిందితుడితో ఇకపై వేధింపులకు పాల్పడబోనని హామీపత్రం రాయించినట్టు విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉంటే మహిళలపై వెకిలిచేష్టలతో వేధింపులకు గురిచేసే నిందితులపై ఒకరిద్దరు ధైర్యం చేసి ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నా న్యాయం జరగడంలేదని మహిళాసంఘాలు ఆరోపిస్తున్నాయి. నిందితులను చట్టప్రకారం శిక్షించకుండా పంచాయితీ పెట్టడంలో అంతరార్థమేంటని ప్రశ్నిస్తున్నాయి.

Tags:    

Similar News