‘ప్రజలకు హెచ్చరిక : అనవసర ప్రయాణాలు చేయద్దు’

దిశ, బాల్కొండ: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని భీమ్‌‌గల్ ఎస్ఐ ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆయా గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు, ప్రవాహం తక్కువగా ఉన్నదనే ఉద్దేశ్యంతో వెళ్ళరాదని, సాహాసాలు చేస్తూ నాలాలు, వాగులు ప్రవహిస్తున్న రహదారులను దాటి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. చెట్లు, శిధిలావస్థలో ఉన్న భవనాలు కింద ఉన్న […]

Update: 2021-09-27 22:23 GMT

దిశ, బాల్కొండ: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని భీమ్‌‌గల్ ఎస్ఐ ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆయా గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు, ప్రవాహం తక్కువగా ఉన్నదనే ఉద్దేశ్యంతో వెళ్ళరాదని, సాహాసాలు చేస్తూ నాలాలు, వాగులు ప్రవహిస్తున్న రహదారులను దాటి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. చెట్లు, శిధిలావస్థలో ఉన్న భవనాలు కింద ఉన్న వారిని గ్రామ అధికారులు, పెద్దలు గుర్తించి వెంటనే వారికి వేరే దగ్గర పునరావాసం కలిపించి, పోలీస్ వారికి తప్పక సమచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర సమయంలో భీమ్‌‌గల్ ఎస్ఐ సెల్ నంబర్. 9440795440, డయల్ 100 ఉపయోగించాలని ఎస్ఐ ప్రభాకర్ పేర్కొన్నారు.

 

Tags:    

Similar News